చిత్రమయ్యా నీ వ్యవహారం
అంతుపట్టదు నీ లీలామహత్యం
ఎన్నో జీవులను సృష్టిస్తావు
తుదివరకు వెంటున్డి రక్షిస్తావు
బంధాలతోటి మమ్ము బందిస్తావు
అనురాగంతో మమ్ము అలరిస్తావు
అమ్మవై నీవు ప్రేమను కురిపిస్తావు
నాన్నవై నీవు మమతను పంచిస్తావు
ప్రతి అణువులో నీవు కోలువుంతావు
భేదభావమేరుగక అభయమొసుగుతావు
మనసులో ఎన్నో ఆశలు పుట్టిస్తావు
కోర్కెల వెంట పరుగులు తీయిస్తావు
నీవు ఆడే ఆటలో బొమ్మలం మేము
నీకు తోచినట్టు మలచుకుంటావు
మాయా చక్రంలో మమ్ము ఇరికిస్తావు
నిన్ను మరిపించి మమ్ము బాధిస్తావు
ఆర్తితో వేడిన చాలు ఆధుకుంటావు
సర్వం నీవేనని మాకు తెలియజేస్తావు
ఎన్నెన్ని జన్మలగా మాకు తోడున్డినావో
మా కష్టసుఖాలతో ఎంత అలసినావో
ఏమిచ్చి తీర్చుకోగలం నీ ఋణము
నీ సేవలో తరించనీయి జీవితము
Tuesday, December 16, 2008
Subscribe to:
Posts (Atom)
